తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ భేటీ అనంతరం ఇద్దరూ మీడియా ముందుకి వచ్చి చంద్రబాబుకి కుప్పంలో జరిగిన సంఘటనలపై భేటీ అయ్యామని తెలిపారు. వైసిపి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, చంద్రబాబు నాయుడుని కుప్పంలో తిరగనివ్వకపోవడం, ప్రతిపక్ష నేతల హక్కులని కాలరాయడం, ప్రజలను కలవనీయకుండా చేయడం ఇవన్నీ చూసి ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నామని ఇరువురు నేతలు తెలిపారు.
అయితే వీరి భేటీ పై ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎంపీ నందిగాం సురేష్. బానిస బతుకు బతికేందుకు సిగ్గు లేదా అంటూ పవన్ కళ్యాణ్ పై బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ మండిపడ్డారు. ” ప్యాకేజ్ స్టార్.. సమాజం, సామాన్యులు అంటూ సొల్లు చెప్తావే.. చంద్రబాబు నిర్వాకంతో 11 మంది చనిపోతే వారి కుటుంబాలను పరామర్శించవు కానీ.. నరహంతకుడైన నీ ఓనర్ ని మాత్రం సాకుతావా? సిగ్గు లేదా ఇంత బానిస బతుకు బతకడానికి ” అని ట్వీట్ చేశారు.
ప్యాకేజ్ స్టార్…. సమాజం సామాన్యులు అంటూ సొల్లు చెప్తావే… చంద్రబాబు నిర్వాకంతో 11 మంది చనిపోతే వారి కుటుంబాల్ని పరామర్శించవు… నరహంతకుడైన నీ ఓనర్ ని మాత్రం సాకుతావా… సిగ్గు లేదా ఇంత బానిస బతుకు బతకటానికి @PawanKalyan
#PackageStarPK pic.twitter.com/MVgcmWUH7B
— Nandigam Suresh YSRCP -MP (@NandigamSuresh7) January 8, 2023