మార్కెట్‌లోకి ‘రెనాల్ట్ ట్రైబర్’ కార్‌.. ధ‌ర తెలిస్తే షాక్‌

-

ప్రముఖ వాహన తయారీ కంపెనీ రెనో తాజాగా మరో కొత్త కారును మార్కెట్‌లోకి ప్ర‌వేశ‌పెట్టింది. దీని పేరు ట్రైబర్. కొత్త రెనాల్ట్ ట్రైబర్ పూర్తిగా కొత్త డిజైన్, ఫీచర్స్ తో వస్తోంది. ఈ సబ్-4 మీటర్ పోటీతో కూడిన ధర, మరింత ప్రీమియం అనుభూతిని అందిస్తోంది. దేశంలో అందుబాటులో ఉన్న దాని మునుపటి మోడళ్ల తో పోల్చి చూస్తే రెనాల్ట్ ట్రైబర్ పూర్తిగా నూతన డిజైన్ తో వస్తుంది. ప్రధానంగా ఇండియన్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కారును డిజైన్ చేశారు.

Renault Triber launched In India
Renault Triber launched In India

ఏడు సీట్లతో అందుబాటులోకి వచ్చిన ఈ కారు వేరియంట్లలో ఆర్‌ఎక్స్‌‌ఈ ధర రూ.4.95 లక్షలు, ఆర్‌ఎక్స్‌ఎల్ ధర రూ.5.49 లక్షలు, ఆర్‌ఎక్స్‌టీ ధర రూ.5.99 లక్షలు, ఆర్‌ఎక్స్‌జెడ్ ధర 6.49 లక్షలుగా ఉండనున్నట్లు ప్ర‌క‌టించారు. రెనో ట్రైబర్‌లో నాలుగు ఎయిర్ బ్యాగ్స్, ఫ్లెక్సీ సీటింగ్ అరెంజ్‌మెంట్, 7 సీటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెనాల్ట్ ట్రైబర్ యొక్క ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. కాంపాక్ట్ ఎంపివి ఒక డ్యూయల్ టోన్ క్యాబిన్ తో ఆధునిక డాష్ బోర్డ్ తో వస్తుంది.

రెనో ట్రైబర్‌లో 1 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్, 71 బిహెచ్‌పి, 96 ఎన్ఎం టార్క్, 5 స్పీడ్ మ్యానువల్, ఆటో గేర్స్ ఉంటాయి. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ కంటే పెద్దది, 182 MM గ్రౌండ్ క్లియరెన్స్ కెర్బ్ బరువు 947 కేజీలు, 3.99 మీటర్ల పొడవు, 1.73 మీటర్ల వెడల్పు, 1.64 మీటర్ల ఎత్తు, ప్రొజెక్టర్ లెన్స్, పగటి పూట నడిచే ఎల్ఈడీ డేలైట్స్ ఉన్నాయి. మ‌రియు 6 సీట్ల కారులో 320 లీటర్ల బూట్ స్పేస్, 7 సీట్ల కారులో 84 లీటర్ల స్పేస్ ఉండనుంది. క్యాబిన్ స్టోరేజీ 31 లీటర్ల వరకు ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news