ప్లాస్టిక్ వాడ‌డం ఎంత డేంజ‌రో తెలుసా..!

-

స‌హ‌జంగా ప్ర‌జ‌లు త‌ర‌చూ వాడే వాటుల్లో ప్లాస్టిక్ ఒక‌టి. ఏ వ‌స్తువు బ‌య‌ట నుంచి తేవాల‌న్నా, బ‌య‌ట ఏమ‌న్నా తినాల‌న్నా, తాగాల‌న్నా మొత్తం ప్లాస్టిక్ మ‌యం. మ‌రియు వారంలో మ‌నిషి స‌మారుగా ఐదు గ్రాముల ప్లాస్టిక్‌ను ఆహారంతో పాటు తీసుకుంటున్నాడ‌ని ఇటీవ‌ల ఒక అధ్యాయ‌నంలో తేలింది. అలాగే ఇండియాలో రోజుకు 25,940 టన్నుల ప్లాస్టిక్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ బయటకొస్తోంది. దాదాపు ఒక్కో ఇండియన్‌‌‌‌ ఏడాదికి 11 కిలోల ప్లాస్టిక్‌‌‌‌ను వాడుతున్నాడు. వాస్త‌వానికి ఇంత ప్లాస్టిక్‌ను ఉప‌యోగిస్తున్నా కూడా.. ప్రపంచంలో ప్లాస్టిక్‌‌‌‌ తక్కువ వాడుతున్న వాళ్ల జాబితాలో ఇండియా ఉంది.

మొద‌ట్లో ప్లాస్టిక్ భలే ఉందనుకున్నారు. కానీ దాని ప్ర‌భావం మ‌నిషిపై ఎంత ప్ర‌భావం చూపుతుందో త‌ర్వాత తెలిసింది. అది కాల్చినపుడు వ్యర్థాలు విష రసాయనాలను వదులుతాయి. వీటితో వన్యప్రాణులు, జలచరాలు, మానవాళి శ్వాసకోశాలు దెబ్బతింటాయి. ప్లాస్టిక్‌‌‌‌ వాడకం తగ్గించాలని ప్రపంచ పర్యావరణ సంస్థలు మొత్తుకుంటున్నాయి. 2002లో ప్లాస్టిక్‌‌‌‌ను బ్యాన్‌‌‌‌ చేసిన తొలి దేశం బంగ్లాదేశ్‌‌‌‌. ప్రపంచవ్యాప్తంగానైతే 127 దేశాలు ప్లాస్టిక్‌‌‌‌ను బ్యాన్‌‌‌‌ చేశాయి. 27 దేశాలు సింగిల్‌‌‌‌ యూజ్‌‌‌‌ ప్లాస్టిక్‌‌‌‌ను నిషేధించాయి.

అమెరికా మాత్రం ఇప్పటివరకు బ్యాన్‌‌‌‌ చేయలేదు. మొద‌టిగా 1907లో మాడ్రన్‌‌‌‌ ప్లాస్టిక్‌‌‌‌ బేకలైట్‌‌‌‌ను అమెరికాలో కనుగొన్నారు. అప్పుడు ఎలక్ట్రిక్‌‌‌‌ వైరింగ్‌‌‌‌లో వాడారు. తర్వాత చాలా ర‌కాలుగా ఉప‌గించ‌డం మొద‌లైంది. ప్రపంచయుద్ధం స‌మ‌యంలో అమెరికాలో ప్లాస్టిక్‌‌‌‌ ఉత్పత్తి మూడు రెట్లు పెరిగింది. ఈ క్ర‌మంలోనే పెట్రో కెమికల్‌‌‌‌ ఇండస్ట్రీలు ఊపందుకున్నాయి.కొన్నేళ్ల త‌ర్వాత ప్లాస్టిక్ ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందో తెలుసుకున్నారు.

ప్లాస్టిక్ వాడ‌కం పై న్యూయార్క్‌‌‌‌ నగరంలో ట్యాక్స్‌‌‌‌ వేయడం కూడా మొద‌లుపెట్టింది. ఈ క్ర‌మంలోనే ప్లాస్టిక్‌‌‌‌ వేస్ట్‌‌‌‌పై రీసెర్చ్‌‌‌‌లు స్టార్టయ్యాయి. దీంతో 48 లక్షల టన్నుల నుంచి కోటి 20 లక్షల టన్నుల మేర ప్లాస్టిక్‌‌‌‌ ఏటా సముద్రాల్లో కలుస్తోందని జార్జియా యూనివర్సిటీ సర్వేలో తేలింది. పెద్ద ప్లాస్టిక్‌‌‌‌ వస్తువులు ‘మైక్రో ప్లాస్టిక్‌‌‌‌’లుగా మారి సముద్ర జీవరాశులు తింటున్నాయని కూడా తెలుసుకున్నారు. ఇంత డేంజ‌ర‌స్ ప్లాస్టిక్ వాడ‌కం ఇలానే ఉంటే మ‌రింత ఎఫెక్ట్ ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

Read more RELATED
Recommended to you

Latest news