తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. తెలంగాణ 2023 – 24 పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల అయింది. డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, వెటర్నరీ, హార్టికల్చర్, అగ్రి కల్చర్ డిప్లోమా కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే, పాలి టెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మే 17 వ తేదీన నిర్వహిస్తామని అధికారికంగా ఉన్నతాధికారులు ప్రకటించారు.
MPC, BIPC విభాగాలకు ఒకే రోజు ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు. జనవరి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 24 వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు https://polycetts.nic.in/ ను సంప్రదించాలని పేర్కొన్నారు ఉన్నతాధికారులు.