గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణానికి రాజ్యసభ సభ్యులు శ్రీ.జోగినపల్లి సంతోశ్ కుమార్ గారు చేస్తున్న కృషి అందరికి స్ఫూర్తివంతంగా నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ. అనిల్ కుర్మాచలం అన్నారు.
ఈ సందర్బంగా ప్రకృతి ప్రేమికుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోశ్ కుమార్ గారు స్వయంగా తన కెమెరాలో బంధించిన చిత్రాలతో ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ముద్రించిన క్యాలెండర్‌ను ఈరోజు ప్రగతి భవన్‌లో ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ ఆవిష్కరించారు.
అనంతరం సంతోష్ కుమార్ మాట్లాడుతూ… తాను తీసిన చిత్రాలతో క్యాలెండర్‌ను రూపొందించిన అనిల్ ను అభినందించి, ఇది తనకో జ్ఞాపకంగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు వాసుదేవ రెడ్డి, సర్దార్ రవీందర్ సింగ్, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ తదితరులు పాల్గొన్నారు.