వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన యువశక్తి కార్యక్రమం సభా స్థలంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గత వారం రోజుల నుంచి జనసేన నేతలు సభకొసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సభ ద్వారా వర్తమాన రాజకీయాలకు ఒకదిశా నిర్దేశం అవుతుందన్నారు.
ఈనెల 12వ తేదీన 12 గంటలకు పార్టీ నుంచి గెలిచిన ఎంపిటిసిలు , జెట్పీటిసిలతో సభ ప్రారంభం అవుతుందన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎర్పటు చెస్తామన్నారు నాదెండ్ల. వందమందిని యువతను సార్ట్ లిస్ట్ చేసి మాటాడిస్తామన్నారు. వనరులు దోచుకొని నాయకత్వాన్ని ఎదగనీయకుండా కొందరు రాజకీయం చెస్తున్నారని ఆరోపించారు. మన రాష్ర్టంలో పెట్టుబడులు, ఉపాధి లేదన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత మరింత నిరుద్యోగిత పెరిగిందన్నారు.
సభకి వివేకానంద వికాశ వేదికగా నామకరణం చేసామన్నారు. నాలుగు ద్వారాలకు గిడుగు రామ్మూర్తి , వీరనారి గున్నమ్మ అల్లూరి సీతారామరాజు , కొడి రామ్మూర్తి నాయుడు పేర్లు పెట్టామని తెలిపారు. 35 ఎకరాల సభకు అన్ని ఏర్పాట్లు చేసామని, మా వాలంటీర్ లకు పోలిసులు సహాకరిస్తున్నారని తెలిపారు. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే ఏవిధంగా పాలసీ ఉండబోతుందని ఈ సభ ద్వారా తెలియ జేస్తామన్నారు. ఉత్తరాంధ్ర సమష్యలు , యువత సమష్యలపై రెండు రాజకీయ తీర్మానాలు ఉంటాయన్నారు.