ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవంపై సందిగ్ధత నెలకొంది. సందిగ్ధతకు తెరదించుతూ సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడవనున్న వందేభారత్ రైలు ప్రారంభోత్సవం షెడ్యూల్ మార్చినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 19న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వందే భారత్ రైలును మోదీ ప్రారంభిస్తారని తొలుత ప్రకటించారు. కానీ, ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడటంతో రైలు ప్రారంభోత్సవం షెడ్యూల్ కూడా మారింది.
కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు దిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్గా వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. వందేభారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి పాల్గొంటారని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.