భారత్‌లో తయారైన దగ్గుమందుకు ఉజ్బెకిస్థాన్‌లో చిన్నారుల మృతికి సంబంధం ఉందన్న ఆరోపణలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. నోయిడాకు చెందిన మరియన్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేసిన రెండు దగ్గు మందులను ఉజ్బెకిస్థాన్‌లోని చిన్నారులకు వాడొద్దని హెచ్చరించింది.
‘ఈ మరణాల నేపథ్యంలో భారత్‌లోని ‘మరియన్ బయోటెక్’ తయారు చేసిన దగ్గుమందులను చిన్నారులకు వాడకూడదని సూచిస్తున్నాం. ఆ రెండు దగ్గుమందుల పేర్లు ‘అబ్రోనాల్’, ‘డాక్-1మ్యాక్స్’. ప్రయోగశాలల నివేదిక ప్రకారం.. దగ్గుమందులో పరిమితికి మించి డైఇథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ ఉన్నాయి. ఈ సంస్థ తయారు చేసిన మందులు నాసిరకమైనవి. నాణ్యతా ప్రమాణాలు అందుకోవడంలో విఫలయ్యాయి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ప్రకటనలో పేర్కొంది.