హన్సిక మోత్వానీ.. గోవా బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇకపోతే ఇటీవలే పెళ్లి పీటలు ఎక్కిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత కూడా సినిమాలకు దూరంగా ఉండకుండా తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. డిసెంబర్ 4వ తేదీన తాను ప్రేమించిన.. తన బిజినెస్ పార్టనర్ సోహెల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . రాజస్థాన్ జైపూర్ లోని మండోటా ప్యాలెస్ లో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న హన్సిక.. కేవలం ఇరువురి కుటుంబ సభ్యులు.. అతి సన్నిహితులైన బంధుమిత్రుల మధ్య మాత్రమే పెళ్లి చేసుకుంది.
ఇకపోతే వివాహం తర్వాత సినిమాలకు దూరం కాబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయంపై హన్సిక మాట్లాడుతూ.. క్లారిటీ ఇచ్చింది.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హన్సిక.. తన సినిమాల గురించి కూడా మాట్లాడుతూ..” పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యే ఉద్దేశం లేదు .. పెళ్లి పనుల వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నాను అంతే… అయితే ఇటీవల ఒక కమర్షియల్ యాడ్ లో కూడా నటించాను. ఈనెల 20 నుంచి సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నాను. ప్రస్తుతం నా చేతిలో 7 సినిమాలు , 2 వెబ్ సిరీస్ లో ఉన్నాయి అంటూ తెలియజేసింది.
ఇకపోతే వీటిలో తెలుగులో రెండు సినిమాలు.. తమిళ్లో ఐదు సినిమాలు ఉన్నట్టు తెలిపింది. తెలుగు వెబ్ సిరీస్ విషయానికి వస్తే నషా అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. మరొకటి తమిళంలో మైత్రి అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ఇకపోతే హన్సిక సేవా కార్యక్రమాల గురించి కూడా ప్రశ్నించగా.. ప్రస్తుతం తాను 30 మంది అనాధ పిల్లలను దత్తత తీసుకున్నట్లు వెల్లడించింది. మొత్తానికి పెళ్లి తర్వాత ఈమె దూకుడు చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.