చేతి గోళ్ళ పైన తెల్లటి మచ్చలు ఉన్నాయా..? అయితే ఈ సమస్యే..!

-

చాలా మంది చేతి గోళ్ళ పై తెల్లటి మచ్చలుగా ఉంటాయి. తెల్లటి మచ్చలు కానీ అడ్డగీతలు కానీ గోళ్ళ మీద ఉంటే జాగ్రత్తగా వాటి నుండి బయటపడడానికి చూడండి. ఎందుకంటే క్యాల్షియం లోపం వలన చేతి గోళ్ళ మీద తెల్లటి మచ్చలు కానీ అడ్డ గీతలు కానీ వస్తాయి గోర్ల మీద తెల్లటి మచ్చల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

nails

 

తెల్లటి మచ్చలు ఉంటే ఇలా చేయండి:

జింక్ లోపం ఉంటే గోల్డ్ మీద తెల్లటి మచ్చలు వస్తాయి. ఆహారం లో జింక్ ఉన్న వాటిని చేర్చుకోవడం మంచిది లేదంటే డాక్టర్ సలహా తీసుకొని సప్లిమెంట్స్ ని తీసుకోండి.

ఈ సమస్యలు కూడా:

జింక్ లోపం వలన గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, ఎముకల సమస్యలు మొదలైనవి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి జింక్ ని ఆహారంలో చేర్చుకోండి.
మన శరీరం జింక్ ని నిలిపి ఉంచుకోలేదు మొత్తం మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది కాబట్టి నిత్యం ఆహారంలో జింక్ ని తీసుకుంటూ ఉండాలి.
మన దేశంలో 73% మంది ప్రజలు జింక్ లోపంతో బాధపడుతున్నారు.

జింక్ ఉండే ఆహార పదార్థాలు:

జింక్ మనకి వెల్లుల్లి, బీన్స్, నట్స్, గుమ్మడి గింజలు, బ్రౌన్ రైస్, ఓట్స్, పాలకూర, పుట్టగొడుగులు, బ్రోకలీ, డార్క్ చాక్లెట్, చికెన్, మటన్, కార్న్ ఫ్లెక్స్, పాల ఉత్పత్తుల్లో లభిస్తుంది కాబట్టి డైట్ లో వీటిని తీసుకుంటూ ఉండండి.

జింక్ సప్లిమెంట్స్ ని కూడా తీసుకోవచ్చు:

జింక్ గ్లూకోనేట్, జింక్ సల్ఫేట్ వంటి వాటిని డాక్టర్ సలహా మేరకు తీసుకోవడం మంచిది. గోళ్ళ మీద తెల్లటి మచ్చలు కానీ గీతాలు కానీ ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news