వాస్తు: బెడ్ రూమ్ నుండి వీటిని వెంటనే తొలగించండి.. లేదంటే సమస్యలే..!

-

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వాస్తుని అనుసరిస్తున్నారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి బాధ ఉండదు. పైగా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాస్తు ప్రకారం మీరు ఇంట్లో వస్తువులను అమర్చుకుంటే ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఉండొచ్చు పైగా నెగెటివిటీ మొత్తం తొలగిపోయి ఆనందంగా ఉండేందుకు అవుతుంది. బెడ్రూంలో చాలా మంది చిన్న చిన్న తప్పులను చేస్తూ ఉంటారు బెడ్రూంలో తప్పులను చేయడం వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది దీని వలన భార్యాభర్తల మధ్య రిలేషన్ షిప్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది.

 

బెడ్ రూమ్ లో ఎప్పుడు కూడా దెయ్యాలకి సంబంధించిన ఫోటోలని పెట్టకూడదు ఇది నెగటివ్ ఎనెర్జీని తీసుకు వస్తుంది.
అలానే పిల్లి గుడ్లగూబ పాము వంటి ఫోటోలని బెడ్ రూమ్ లో పెట్టడం మంచిది కాదు ఇది కూడా ఇబ్బందుల్ని కలిగిస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ ని దెబ్బతీస్తుంది. యుద్ధానికి సంబంధించిన ఫోటోలని కూడా పెట్టుకోకూడదు. బెడ్ రూమ్ లో యుద్ధానికి సంబంధించిన ఫోటోలని క్రూర జంతువులని పెట్టుకోవడం వలన సమస్యలు వస్తాయి. ఒంటరిగా ఉండేవి ఏమి పెట్టుకోకూడదు దీని వలన మీ జీవితం కూడా ఒంటరి అయ్యి పోయే ప్రమాదం ఉంది.
వాస్తు శాస్త్రం ప్రకారం నీటికి సంబంధించిన ఫోటోలని కూడా పెట్టుకోకూడదు నీటి కి సంబంధించిన వాటిని ఉంచడం వలన రిలేషన్షిప్ పాడవుతుంది.
చనిపోయిన వారి ఫోటోలని కూడా బెడ్ రూమ్ లో ఉంచుకోకూడదు కాబట్టి తప్పులు చేయకుండా చూసుకోండి దానితో ప్రశాంతంగా ఉండేందుకు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news