మంచి నాయకత్వం కోసం.. ఓటు హక్కును వినియోగించుకుందామని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇవాళ జాతీయ ఓటు హక్కు దినోత్సవo. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఓటు హక్కును వినియోగించుకుందాం..ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం మనవంతు పాత్ర పోషిద్దామని పిలుపు ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర CM కేసీఆర్. కాగా, హుస్సేన్ సాగర్ తీరాన ఒక పక్క జ్ఞానబోధి బుద్ధుడు, మరో పక్క రాజ్యాంగ నిర్మాత, కర్తవ్యదీక్షాపరుడు డా. బిఆర్ అంబేద్కర్, ఎదురుగా త్యాగాలను గుర్తుచేసే అమరవీరుల దీపకళిక నిర్మాణాలతో, దేశంలోనే కనీవిని ఎరుగని రీతిలో, అత్యంత వైభవోపేతంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటేలా నిర్మితమౌతూ మరికొద్ది రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధమౌతున్న తెలంగాణ ప్రజాపాలనా సౌధం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవనం తుదిమెరుగులు దిద్దుకుంటోంది.
సీఎం శ్రీ కేసీఆర్ దార్శనికతతో, అత్యంత సహజమైన రీతిలో, నలు దిశలనుంచి సహజమైన గాలి వెలుతురు ప్రసరించేలా, ఆహ్లాదకరమైన వాతావరణంలో సచివాలయ సిబ్బంది విధులు నిర్వహించేలా దేశంలోనే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో నిర్మితమౌతున్న రాష్ట్ర సచివాలయం ముఖ్యమంత్రి గారి పుట్టిన రోజు ఫిబ్రవరి 17 న ప్రారంభోత్సవానికి సిద్ధమౌతోంది.