హీరో అడివి శేష్ ఇంట్లో పెళ్లి బాజాలు.. సినీ తారల సందడి షురూ..!

-

టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఇంట్లో తాజాగా పెళ్లి సందడి మొదలయ్యింది. అతని సోదరి షిర్లీ పెళ్లి వేడుకలు ఇప్పుడు ఘనంగా జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా మెహందీ, హల్దీ ఈవెంట్స్ వేడుకలు అంబరాన్నంటనున్నాయి. ఈ వేడుకలకు ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ తో పాటు పలువురు సినీ తారలు కూడా సందడి చేసినట్లు అందుకు సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన సోదరి వివాహానికి సంబంధించిన ఫోటోలను అడివి శేష్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్నారు..

“చెల్లి పెళ్లిలో అమ్మానాన్న.. నేను.. ఆనందంగా గడుపుతున్నాము.. మా బావ డేవిడ్ ను మా కుటుంబంలోకి ఆహ్వానించబోతున్నాం” అంటూ పోస్ట్ షేర్ చేయగా..” చిట్టి చెల్లికి పెళ్లి జరుగుతుంది . రాజస్థానీ థీమ్ ట్రై చేసాం.. కానీ పెళ్లి మాత్రం తెలుగు సాంప్రదాయం ప్రకారమే జరుగుతుంది” అంటూ మరో పోస్ట్ కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా షిర్లీ – డేవిడ్ దంపతులకు అడివి శేష్ అభిమానులతో పాటు పలువురు నెటిజన్లు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు.

అడివి శేష్ సినిమాల విషయానికొస్తే.. క్షణం, గూఢచారి, ఎవరు , మేజర్, హిట్ 2 ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ లతో ఫుల్ జోష్లో ఉన్న ఇతడు ఇప్పుడు గూడచారి 2 సినిమాలో కూడా నటిస్తున్నాడు. ముఖ్యంగా ఇందుకు సంబంధించిన పోస్టర్ని కూడా విడుదల చేయగా సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తోంది ఈ పోస్టర్.<

 

View this post on Instagram

 

A post shared by Sesh Adivi (@adivisesh)

/p>

Read more RELATED
Recommended to you

Latest news