మహానటి పీకల్లోతు ప్రేమలో! వెంటనే పెళ్లి!

-

రీసెంట్ గా తెలుగు సినిమాల్లో నటించే హీరోయిన్ పీకల్లోతు ప్రేమ లో ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమెనే మహానటి సినిమా తో మాంచి పాపులర్ అయిన కీర్తీ సురేష్. కీర్తి కూడా పెళ్లికి అంగీకరించినట్లు, దీంతో నటనకు గుడ్‌ బై చెప్పనున్నట్లు సోషల్ మీడియాలో టాక్‌ వినిపిసిస్తోంది. అయితే వివాహానంతరం కీర్తీ సురేష్‌ సినిమాల్లో నటించడానకి ఒప్పుకోవడం లేదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కాగా గతంలో మహానటి పెళ్లిపై పలు రూమర్లు వచ్చాయి. సౌత్‌ ఇండియన్‌ రాక్‌స్టార్‌ అనిరుధ్‌తో ఆమె ప్రేమలో ఉందని, ఇద్దరూ పెళ్లికూడా చేసుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే కీర్తి తల్లిదండ్రులు వాటిని కొట్టి పడేశారు. ఇప్పుడు కూడ ఆమె సినిమాల్లో నటించకుండా మంచి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు బడ్జెట్ లో తీయాలని లక్ష్యంగా పెట్టుకుందట.

ప్రస్తుతం పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తో కలిసి వాశి అనే సినిమాలో నటించింది . కీర్తి చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. నేచరల్ స్టార్ నాని సరసన ఆమె నటిస్తోన్న దసరా పిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మెగాస్టార్‌ చిరంజీవి చెల్లెలిగా నటిస్తోన్న భోళాశంకర్‌ కూడా శరవేగంగా షూటింగ్‌ దశలో వుంది. వీటితో పాటుగా మరి కొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇవన్ని పూర్తి అయితేనే పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన లో ఉందని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news