బండి సంజయ్‌ కుమారుడికి 41ఏ సీఆర్పీసీ నోటీసులు

-

బండి సంజయ్‌ కొడుకుకు దుండిగలు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారం కిందట ఈ నోటీసులు జారీ చేసినా.. పోలీసులు రహస్యంగా ఉంచారు. హైదరాబాద్‌ లోని ఓ యూనివర్సిటీలో చదువుతున్న బండి సంజయ్‌ కొడుకు అసభ్య పదజాలంతో.. తోటి విద్యార్థిని దూషిస్తూ, దాడికి పాల్పడిన వీడియో జనవరి 17వ తేదీన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ సంఘటనపై ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు అదే రోజు దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ లో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే.. ఈ నెల 18న ఆయన పోలీసు స్టేషన్‌ కు వెళ్లి ఈ కేసు వివరాలను సీఐ రమణారెడ్డిని అడిగి తెలుసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news