BREAKING : మళ్లీ గుండెపోటు..బెంగళూరుకు తారకరత్న తరలింపు..!

-

బెంగళూరులోని నారాయణ హృదయాలయంలో నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. డాక్టర్ ఉదయ్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఇంకా కమ్మరి కాసేపట్లోనే తారకరత్న హెల్త్ బులిటెన్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది.

శుక్రవారం అర్ధరాత్రి ఆయనను ప్రత్యేక అంబులెన్స్ లో కుప్పం నుంచి బెంగళూరుకు తరలించారు. కాగా,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసుపత్రిలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఆసుపత్రి వైద్యులతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news