ప్రపంచానికి పరిష్కారం చూపేలా భారత్‌ ఎదుగుదల : రాష్ట్రపతి

-

దేశం ఆత్మనిర్భర్‌ భారతంగా ఆవిర్భవిస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్నారు. ‘‘డిజిటల్‌ ఇండియా దిశగా భారత్‌ ముందుకెళ్తోంది. సాంకేతికతను అందిపుచ్చుకొని నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్నాం. ఆయుష్మాన్‌ భారత్‌ వంటి మెరుగైన పథకాలు తీసుకొచ్చాం. మాది ప్రజల ఆత్మవిశ్వాసం పెంచే ప్రభుత్వం. రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం. అవినీతి అంతం దిశగా దేశం అడుగులేస్తోంది. విధాన లోపాన్ని వీడి దేశం.. ముందడుగు వేస్తోంది. ప్రపంచానికి పరిష్కారాలు చూపేలా భారత్ తయారైంది’’ అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.

‘ఆదివాసీ ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశాం. తొలిసారిగా బిర్సా ముండా జయంతి ఉత్సవాలు జరిపాం. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. తీవ్రవాద ప్రభావిత జిల్లాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం. ఈశాన్య రాష్ట్రాలు, సరిహద్దు గ్రామాల్లో రక్షణ చర్యలు చేపట్టాం. మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం. అన్ని రంగాల్లో మహిళలు రాణించేలా చర్యలు తీసుకుంటున్నాం. నిరుపేదలకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతోంది. పాఠశాలల్లో డ్రాప్‌ అవుట్స్‌ను తగ్గించేలా చర్యలు తీసుకున్నాం.’ అని రాష్ట్రపతి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news