ఆధార్‌తో నేరుగా అకౌంట్ లోకి డబ్బులు.. కీలక ప్రకటన చేసిన కేంద్రం..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ వలన ఎన్నో ఉపయోగాలు వున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వే 2023ని పార్లమెంట్‌లో పెట్టారు. ప్రభుత్వ సామాజిక పథకాలను పొందేందుకు ఆధార్ ఎంతో అవసరం. అయితే 318 కేంద్ర ప్రభుత్వ పథకాలు, 720 డీబీటీ పథకాలు ఆధార్ చట్టం 2016లోని సెక్షన్ 7 కింద నోటిఫై అయ్యిందన్నారు.

ఆర్థిక సర్వే ఆధార్ ఏవిధంగా ప్రభావితం చేస్తుందని చెప్పింది. పూర్తి వివరాలని చూస్తే.. ఆధార్ నంబర్ బ్యాంక్ ఖాతాతో లింక్ అయ్యి ఉంటుంది. ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ (ఏపీబీ) ద్వారా ఎవరైనా కూడా ఆధార్ నంబర్‌తో బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ప్రభుత్వ పథకాల నుంచి డబ్బులు తీసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, బ్రాంచ్ వివరాలు ఇవ్వాలి.

ఈ పేమెంట్ సిస్టం తో ఆధార్ సహాయం తో అకౌంట్ నుండి డబ్బులు తీసుకోవచ్చు. పంపచ్చు. డోర్ స్టేప్ బ్యాంకింగ్ కూడా పొందొచ్చు. కోవిడ్-19తో ఏర్పడిన ఇబ్బందులను తొలగించేందుకు కూడా అవుతుంది.
జన్‌ధన్, ఆధార్, మొబైల్ ట్రినిటీ లేదా జామ్ డీబీటీతో ఇచ్చే సర్వీస్.
ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకాన్ని విజయవంతం చేయడానికి ఆధార్ కార్డ్ కీలక పాత్ర పోషించింది. డూప్లికేట్, తప్పుడు లబ్ధిదారులను తొలగించేందుకు లింక్ చేస్తే సరిపోతుంది.
రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంలో భాగంగా పెట్టుబడి సాయం కూడా ఇస్తోంది కేంద్రం.
ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా వృద్ధులు వాళ్ళ ఫోన్స్ నుండే జీవన్ ప్రమాణ్ పత్రాన్ని అందించచ్చు. అలానే పెన్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ పని చేయకపోతే ఫేస్ అథెంటికేషన్ హెల్ప్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news