2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చిన్నారులు, యుక్త వయస్సు వారి కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నాణ్యమైన పుస్తకాల లభ్యతను సులభతరం చేయడం కోసం దీనిని అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.
‘భౌగోళిక, భాషాపరమైన, కళలపరంగా,అన్ని స్థాయుల్లో పుస్తకాలను ఇది అందుబాటులోకి ఉంచుతుంది. యువత కోసం పంచాయతీ, వార్డు స్థాయుల్లో ఫిజికల్ లైబ్రరీలు ఏర్పాటుకు రాష్ట్రాలకు ప్రోత్సాహం అందిస్తాం. అలాగే నేషనల్ డిజిటల్ లైబ్రరీ సదుపాయాన్ని పొందేందుకు కావాల్సిన మౌలిక వసతులకు తోడ్పాటునందిస్తాం’ అని నిర్మలమ్మ వెల్లడించారు.