కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ టైపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పదవి రాలేదని అసంతృప్తి ఉండడం సహజమేనని, కానీ బహిరంగంగా ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం సరైనది కాదన్నారు. ప్రతిపక్షంతో మాట్లాడుకున్న తర్వాత కోటంరెడ్డి మాటలకు విలువ ఏమి ఉంటుందని అన్నారు. ఆడియోలతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు సజ్జల.
విచారణ చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. నెల్లూరు రూరల్ ఇన్చార్జిగా ఇంకా ఎవరిని నియమించలేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారని.. ఫోన్ ట్యాపింగులను కాదని స్పష్టం చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుపై కూడా మండిపడ్డారు. కొంతమందిని ఎలా లాక్కోవాలో చంద్రబాబుకు తెలుసు అని వ్యాఖ్యానించారు సజ్జల.