నాగపూర్ టెస్టులో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రవీంద్ర జడేజాకు ఐసిసి షాక్ ఇచ్చింది. AUS తొలి ఇన్నింగ్స్ 46వ ఓవర్లలో జడేజా తన ఇండెక్స్ ఫింగర్ కు సూత్నింగ్ క్రీమ్ ను అప్లై చేయడాన్ని ICC తప్పుబట్టింది.
ఫీల్డ్ అంపైర్ల పర్మిషన్ లేకుండా అలా చేసినందుకు జడేజా మ్యాచ్ ఫీజులో 25% కోత విధించడంతోపాటు ఒక పాయింట్ డిమెరిట్ చేసింది. అయితే క్రీమ్ బంతికి అప్లై చేయలేదని తేలడంతో కఠిన చర్యలు తీసుకోలేదు. కాగా, ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ 132 పరుగులు తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. మొదటి మ్యాచ్ లో భారత్ స్పిన్నర్లు మాయాజాలం సృష్టించారు. టాస్గరికి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్ కేవలం 177 పరుగులకే ఆల్ అవుట్ అయింది.