ఐ లవ్ యూ సీఎం కేసీఆర్ – బండ్ల గణేష్

-

తెలంగాణే కాదు.. దేశాన్ని నడిపించండని.. సీఎం కేసీఆర్ పై బండ్ల గణేష్ ప్రశంసలు కురిపించారు. యువర్ ఏ వండర్ ఫుల్, యువర్ ఫీచర్ ఆఫ్ ఇండియా.. లవ్ యు కేసీఆర్ గారు అంటూ పేర్కొన్నారు. ⁦ఇవాళ కుటుంబ సమేతంగా యాదాద్రి దేవాలయాన్ని దర్శించుకున్నారు బండ్ల గణేష్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పై ట్వీట్‌ చేశారు. ఈ రోజు భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రమైన మన తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో మీ ఆలోచన విధానం, మీ కఠోర తపస్సు, మీ ముక్కుసూటితనం ఎంతో ఉపయోగపడింది, ఆనందాన్నిస్తుందన్నారు.

మీ మదిలో వచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, మీ మదిలో వచ్చిన ప్రతి ఆలోచనని ఆచరణలో పెట్టి ప్రజలకు అందించాలన్న మీ సంకల్పం చాలా గొప్పది.ఆనందంగా, చురుగ్గా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రానికే గాక భారతదేశం మొత్తానికి మీ అమూల్యమైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ కేసీఆర్‌ ను పొగిడారు.మీరు ఈ రాష్ట్రానికే కాదు దేశాన్ని కూడా అద్భు తమైన ప్రగతి పదం వైపు నడిపించే సత్తా, సామర్థ్యత మీకు ఉన్నాయని పూర్తిగా నమ్ముతున్నాను ఈ యాదగిరి నరసింహ స్వామి ఆలయం చూశాక..చాలా సంతోషం అనిపించింది.. ముఖ్యమంత్రి గారు మీకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయలేకుండా ఉండలేక పోతున్నానన్నారు బండ్ల గణేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news