పాకిస్థాన్ లో పోలీసులే లక్ష్యంగా కాల్పులు.. 9 మంది మృతి

-

పాకిస్థాన్‌లో మరోసారి తుపాకీ మోత మోగింది. మరోసారి ఉగ్రవాదులు మరోసారి పోలీసులాపై విరుచుకుపడ్డారు. పోలీసులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. భారీగా ఆయుధాలు ధరించిన 8 మంది పాకిస్థాన్ తాలిబన్ మిలిటెంట్లు కరాచీ పోలీసు ప్రధాన కార్యాలయంపై కాల్పులకు దిగారు.

వెంటనే అప్రమత్తమైన   పోలీసులు, సైన్యం ప్రతిఘటించాయి. ఈ ఘటనలో  ఐదుగురు  తీవ్రవాదులు, ఇద్దరు పోలీసులు, ఇద్దరు పౌరులు మృతి చెందారు.మరో 18 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు పోలీసలు యునిఫామ్‌ ధరించి పోలీసు ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించినట్లు డీఐజీ ఇర్ఫాన్ తెలిపారు.

పోలీసులు ఎదురుకాల్పులకు దిగడంతో ముగ్గురు తీవ్రవాదులు తమను తాము కాల్చుకొని చనిపోయినట్లు డీఐజీ చెప్పారు.ఉగ్రవాదులు మెుదట గ్రనెడ్లతో దాడి చేసి.. అనంతరం విచక్షారాహితంగా కాల్పులకు దిగినట్లు పోలీసులు తెలిపారు.  పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు వచ్చిన విదేశీ క్రికెటర్ల హోటళ్లు కరాచీ పోలీసు కార్యాలయానికి దగ్గరగా ఉండటంతో భద్రతను పెంచినట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news