ఆర్థరైటిస్ సమస్య కలుగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. కీళ్లనొప్పులు అనేవి మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ కణాల్ని, ఉపస్థి నరాలను నాశనం చేయడం ప్రారంభిస్తాయి. కీళ్ల నొప్పులకు ఎలాంటి శాశ్వత పరిష్కారం లేదు. కానీ జాగ్రత్తగా ఉంటే మంచిది. అయితే ఆర్థరైటిస్ సమస్య రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

ఎక్కువగా ఆర్థరైటిస్ బాగా బరువు ఉన్న వాళ్లలో వస్తుంది. ఒబేసిటీ సమస్య వున్నవారికి ఎక్కువ ఆర్థరైటిస్ వచ్చే రిస్క్ వుంది. ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది.
అలానే ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకూడదు. దీని వల్ల బరువు పెరిగిపోతారు.
పంచదార, మైదా తీసుకోవడం వల్ల ఎక్కువ బరువు పెరిగిపోతారు. దీనితో జాయింట్ పెయిన్స్ వంటివి కలుగుతాయి.
కాబట్టి అటువంటి వాటికి బదులుగా పండ్లు, కూరగాయలు, నట్స్ వంటి పోషక పదార్ధాలు ఉన్నటువంటి ఆహారం తీసుకుంటూ ఉండాలి.
అదేవిధంగా హై హీల్స్ వంటివి ధరించడం వల్ల కూడా ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. ఒత్తిడి కలగడం జాయింట్ పెయిన్స్ లాంటివి కలుగుతాయి. కాబట్టి అటువంటి వాటిని అవాయిడ్ చేయడం మంచిది.
మోకాళ్ల గాయాలు వంటివి కలగడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది కాబట్టి ఇటువంటి వాటి నుంచి జాగ్రత్తగా ఉంటే మంచిది.

ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడం, దెబ్బలు తగలకుండా చూసుకోవడం ఇలాంటివి చేస్తే మంచిది అలానే మంచి పోషకాహారం తీసుకోండి ఇలా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news