రైతులకు గుడ్ న్యూస్..పీఎం కిసాన్‌ డబ్బులు అకౌంట్లో పడేది అప్పుడే..!

-

దేశంలోని రైతుల అభివృద్ధి కోసం పీఎం మోడీ ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారు..ప్రభుత్వం అనేక ప్రయోజనకరమైన పథకాలను అమలు చేస్తోంది. తద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో ఇప్పటివరకు 12 విడతలు రైతుల ఖాతాలకు చేరాయి..ఈ పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం రూ.6000 సహాయం అందజేస్తారు. ఈ మొత్తం 6000 రూపాయలు మూడు వాయిదాల్లో అందజేస్తోంది కేంద్రం.13వ విడత ఎప్పుడెప్పుడా అని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు దానికి సంబందించిన మరో అప్డేట్ వచ్చింది..

కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడత హోలీలోపు రైతుల ఖాతాలోకి వస్తుందని భావిస్తున్నారు. త్వరలో 13వ విడత విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకాన్ని ఫిబ్రవరి 24, 2019న ప్రారంభించింది మోడీ సర్కార్‌. అంటే ఫిబ్రవరి 24, 2023 నాటికి ఈ పథకం 4 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ రోజున ప్రభుత్వం ఖాతాలోకి నిధులను బదిలీ చేయవచ్చని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి తేదీని ప్రకటించలేకపోయినా అదే రోజు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేఅవకాశం ఉందని సమాచారం..

ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి ఇ-కేవైసీ తప్పనిసరి. కేవైసీ లేని రైతులకు ఈ విడత డబ్బులు నిలిచిపోనున్నాయి. e-KYC పూర్తి చేయడానికి రైతులు ముందుగా PM కిసాన్ పోర్టల్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. అక్కడ ఫార్మర్ కార్నర్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అందులో e-KYCపై క్లిక్ చేయాలి. దీని తర్వాత కొత్త పేజీ తెరిచినప్పుడు ఆధార్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆధార్ నుండి నమోదైన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసిన తర్వాత తర్వాత e-KYC పూర్తవుతుంది…ఇలా చేస్తేనే డబ్బులు అకౌంట్లో పడతాయి..

Read more RELATED
Recommended to you

Latest news