ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కార కార్యక్రమం ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ ముంబయిలో అట్టహాసంగా జరిగింది. సోమవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో సినీ తారలు సందడి చేశారు.
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించి ‘RRR’ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకుంది. ‘కాంతారా’లో నటనకు గానూ రిషబ్‌శెట్టి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్ (బ్రహ్మాస్త్ర-1), ఉత్తమనటిగా ఆలియాభట్ (గంగూబాయి కాఠియావాడి) చిత్రాలకు అవార్డును అందుకున్నారు. చిత్రీకరణలో బిజీగా ఉండి రణ్‌బీర్ హాజరుకాలేకపోవడంతో ఆయన సతీమణి అలియా భట్ ఉత్తమనటుడి అవార్డు అందుకున్నారు.
విజేతలు వీరే..
ఉత్తమ చిత్రం: ది కశ్మీర్ ఫైల్స్
ఉత్తమ దర్శకుడు: ఆర్.బాల్కి (చుప్: ది రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్)
ఉత్తమ నటుడు: రణ్‌బీర్ కపూర్ (బ్రహ్మాస్త్ర-1)
ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కాఠియావాడి)
మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: రిషబ్‌శెట్టి (కాంతారా)
క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్: వరుణ్ ధావన్ (బేడియా)
మోస్ట్ వర్సటైల్ యాక్టర్: అనుపమ్ ఖేర్
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్: సాచిత్ తాండన్
క్రిటిక్స్ ఉత్తమ నటి: విద్యాబాలన్ (జల్సా)
ఉత్తమ సహాయ నటుడు: మనీష్ పాల్ (జగ్ జగ్ జీయో)
ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్: ఆర్ఆర్ఆర్
టెలివిజన్ విభాగంలో..
ఉతమ నటుడు: జైన్ ఇమనాన్
ఉత్తమ నటి: తేజస్వీ ప్రకాశ్
ఉత్తమ సహాయ నటి: షీబా చద్దా
వెబ్ సిరీస్ విభాగంలో..
ఉత్తమ వెబ్‌సిరీస్: రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్
ఉత్తమ నటుడు: జిమ్ షార్బ్ (రాకెట్ బాయ్స్)
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ఆది ఇయర్: అనుపమ (సీరియల్)