తాజాగా ఈపీఎఫ్ఓ ఒక గుడ్ న్యూస్ ని చెప్పింది. అధిక పింఛనుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఆగస్టు 31, 2014 తేదీ కన్నా ముందు నుంచే సభ్యులుగా ఉన్నవాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇచ్చింది. అధిక పెన్షన్ అందుకునేందుకు అవకాశం ఇస్తోంది. ఫిబ్రవరి 20న ఇందు మేరకు సర్క్యూలర్ ని జారీ చేసింది.
గతం లో ఈపీఎస్ స్కీమ్‌కు అర్హత ఉండి కూడా దరఖాస్తు చేసుకోలేకపోయిన వాళ్ళు ఇప్పుడు అప్లై చేయచ్చు. నవంబర్ 4, 2023 న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం స్కీమ్‌కు అర్హులైన ఉద్యోగుల్లో రెండు కేటగిరీలు ఉన్నాయి. రెండు కేటగిరీల ఉద్యోగులు అధిక పెన్షన్ కోసం మార్చి 3, 2023 నాటికి దరఖాస్తు చెయ్యచ్చు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి…?
ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది చూస్తే… ఫిబ్రవరి 20, 2023న ఈపీఎఫ్ఓ జారీ చేసిన కొత్త సర్క్యూలర్ ప్రకారం ఉద్యోగులు తమకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాల ద్వారా దరఖాస్తు చెయ్యచ్చు.
ఈపీఎఫ్ఓ చట్టంలోని ప్యారా 11 (3), ప్యారా 11(4) సవరణకు ముందు అయితే గరిష్ఠ వేతన పరిమితి రూ.6500గా ఉంది. 2014లో రూ.15 వేలకు పెంచారు. గరిష్ఠ పరిమితితో సంబంధం లేకుండా అంతకు మించి వేతనం పొందేవాళ్ళు ఈపీఎస్ లో జమ చెయ్యచ్చు. 2014 సవరణ నాటికి ఈ పథకంలో చేరని ఉద్యోగులకు మాత్రం ఆప్షన్ ఇవ్వలేదు.
కానీ ఇప్పుడు ఇంకో అవకాశాన్ని ఇస్తున్నారు. ఫార్మాట్‌లో రిక్వెస్ట్ చేసుకోవాల్సి ఉండి. ఈపీఎఫ్ఓ జాయింట్ ఆప్షన్‌కు సంబంధించిన ప్రత్యేక యూఆర్ఎల్‌ను కూడా తీసుకొస్తామని అంది. అధికారిక వెబ్‌సైట్‌లో సంబంధిత లింక్‌ను కూడా ఉంచింది. ఈ యూఆర్ఎల్ ద్వారా సభ్యులు డిజిటల్‌గా లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేసేయచ్చు. పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయం ఇన్‌ఛార్జులు జాయింట్ ఆప్షన్ దరఖాస్తులను చూస్తారు. ఇ-మెయిల్, పోస్ట్, మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తారు.