వరంగల్ ఈస్ట్‌ బరిలో సుస్మితా ఫిక్స్..కారుకు చెక్?

-

కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి వరంగల్ కూడా ఒకటి. గతంలో ఇక్కడ కాంగ్రెస్ హవా నడిచేది..కానీ గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ హవా నడిచింది. అయితే కాంగ్రెస్ పార్టీ బలం ఎక్కువగా ఏమి తగ్గలేదు. దాదాపు మెజారిటీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది..ఆ పార్టీకి బలమైన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అలా బలంగా ఉన్న స్థానాల్లో వరంగల్ ఈస్ట్ కూడా ఒకటి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది.

కొండా సురేఖ ఫ్యామిలీ ఇక్కడ రాజకీయం నడిపిస్తుంది. పరకాలతో పాటు ఈ సీటులో కూడా పనిచేస్తున్నారు. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన వరంగల్ ఈస్ట్ లో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా, 2014లో బి‌ఆర్‌ఎస్ గెలిచింది. బి‌ఆర్‌ఎస్ తరుపున కొండా సురేఖ గెలిచారు. కానీ 2018 ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్ లో చేరి..పరకాలలో పోటీ చేసి ఓడిపోయారు. 2018లో వరంగల్ ఈస్ట్ లో బి‌ఆర్‌ఎస్ తరుపున నన్నపునేని నరేందర్ గెలిచారు.

ప్రస్తుతానికి నరేందర్ ఎమ్మెల్యేగా ఉన్నారు..అయితే ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేకు పెద్ద పాజిటివ్ కనిపించడం లేదు. అటు కాంగ్రెస్ నుంచి కొండా ఫ్యామిలీ బలంగా కనిపిస్తుంది. ఇక ఈ సీటులో కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తారని తెలిసింది. తాజాగా రేవంత్ పాదయాత్ర జరిగింది..పాదయాత్రకు భారీగా జనం వచ్చేలా కొండా ఫ్యామిలీ చేసింది.

పాదయాత్ర సమయంలో రేవంత్ వెనుకే కొండా ఫ్యామిలీ ఉంది. ఇక వచ్చే ఎన్నికల్లో పరకాల సీటులో కొండా సురేఖ, వరంగల్ ఈస్ట్ లో సుస్మితా పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. మరి ఈస్ట్ లో బి‌ఆర్‌ఎస్ కు చెక్ పెట్టి కొండా ఫ్యామిలీ సత్తా చాటుతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news