భార‌త్ ఆ బాంబు వేస్తే.. పాకిస్తాన్ ప‌ని ఖ‌త‌మేనా..!

-

భార‌త్‌లో  పాకిస్తాన్ పుల్వామా దాడి సంఘ‌ట‌న‌కు పాల్ప‌డి ప‌లువురు భార‌త జ‌వాన్ల‌ను మ‌ట్టుబెట్టింది.. దీనికి ప్ర‌తీకారంగా భార‌త్ పాకిస్తాన్‌లో స‌ర్జిక‌ల్ స్ట్రైక్ నిర్వ‌హించి పాక్ ఫీచ‌మ‌నిచింది. అయితే దీని నుంచి గుణ‌పాఠం నేర్వ‌ని పాకిస్తాన్ భార‌త్‌పై అనేక‌సార్లు క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌టం, దీనికి భార‌త జ‌వాన్లు జ‌వాబుగా తిప్పి కొట్ట‌డం స‌ర్వ‌సాధార‌ణంగానే జ‌రుగుతున్నాయి. అయితే భార‌త్ తాజాగా జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగిస్తూ.. ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో పాక్, భారత్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

భార‌త్‌లో అంత‌ర్భాగ‌మైన జ‌మ్ము క‌శ్మీర్‌ను అంత‌ర్జాతీయ స‌మ‌స్య‌గా చేసి చూపే ప్ర‌య‌త్నం చేసింది. పాకిస్తాన్‌కు ఏ దేశం మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఏకాకిగా మారింది. దీంతో ఏం చేయాలో తెలియ‌ని పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ భార‌త్‌పై అణుబాంబుల‌తో యుద్ధం చేస్తామంటూ పసిపిల్లాడిలా అవాకులు చ‌వాకులు పేలుతున్నాడు.. అయితే భార‌త్ తో ఓసారి స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌తో చావుదెబ్బ తిన్నాకూడా బుద్ది తెచ్చుకోకుండా తోక జాడిస్తున్నాడు. అయితే పాకిస్తాన్ అణుబాంబు వేస్తే భార‌త్ ఏమైనా చేతులు ముడుచుకుని కూర్చుంటుందా ? కేవ‌లం కొంద‌రు సైనికుల‌ను పొట్ట‌న పెట్టుకుంటేనే స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌తో ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త్ ఇప్పుడు యుద్ధ‌మే జ‌రిగితే.. ఇక చూస్తూ ఊరుకుంటుందా.. అందుకే మ‌రోమారు ఎయిర్ స్ట్రైక్ చేసేందుకు భార‌త్ స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.

భార‌త్‌పై పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌లు మానుకోక‌పోతే ఎయిర్ స్ట్రైక్ చేసేందుకు భార‌త్ ఎప్పుడైనా సిద్ద‌మేన‌ట‌.. అందుకు త‌గిన విధంగా భార‌త్ ఆయుధ సంప‌త్తిని స‌మ‌కూర్చుకుంటుంది.. అయితే ఇప్పుడు భార‌త్ అమ్ముల పొదిలో అత్యంత శ‌క్తివంత‌మైన బాంబులు వ‌చ్చి చేరుతున్నాయి.. దేశ ఆయుధ సంపత్తిని వృద్ధి చేసే పనిలో భాగంగా.. జూన్ మాసంలో ఇజ్రాయిల్‌తో పలు ఒప్పందాలు కుదిర్చారు దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ. అత్యంత శక్తివంతమైన స్పైస్-2000 బాంబులను ఆర్డర్ చేశారు. మొత్తం వంద స్పైస్-2000 బాంబులను కొనుగోలు చేసేందుకు భారత వైమానిక దళం రూ.300 కోట్లతో డీల్ కుదుర్చుకుంది. ఈ బాంబులు ప్రస్తుతం భారత్ చేరుకున్నాయి.

ఒప్పందంలో భాగంగా మొదటి విడత స్పైస్- 2000 బాంబులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లోని వైమానిక కేంద్రానికి వచ్చాయి. ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ నుంచి మరిన్ని బాంబులు రానున్నాయి. అయితే ఈ బాంబులనే బాలాకోట్‌ ఉగ్రస్థావరాలపై ప్రయోగించింది. అయితే తాజాగా చేరిన స్పైస్-2000 మరింత శక్తివంతమైనవి. ఇవి పెద్ద పెద్ద బిల్డింగ్‌లను సైతం సులభంగా నేలమట్టం చేయగలవు. ఈ బాంబులను ప్రయోగించే సామర్థ్యం ఉన్న మిరాజ్ -2000 యుద్ధ విమానాలు గ్వాలియర్‌లో వైమానిక స్థావరంలో ఉన్నాయి. దీంతో ఈ స్పైస్-2000 బాంబులను కూడా అక్కడికే తరలించారు. ఇక వచ్చే నెలలోనే భారత్ చేతికి రాఫేల్ యుద్ధ విమానాలు కూడా రాబోతున్నాయి. అయితే అవి పూర్తిగా మన దేశానికి చేరడానికి మరో ఆరు నెలలు పడుతుంది. కానీ యుద్ధం అనేదే జరిగితే.. తక్షణమే వాటిని రప్పించే అవకాశం కూడా లేకపోలేదు. ఏదేమైనా ప్రస్తుతం స్పైస్-2000 బాంబులు భారత్ అమ్ములపొదిలోకి చేరడం.. పాక్‌కు భారీ షాక్ తగిలినట్లైంది.

Read more RELATED
Recommended to you

Latest news