రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ వస్తున్న సినిమా కోసం అభిమానులతో పాటు సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓ పక్క దర్శకుడు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తుంటే మరో పక్క సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రానికి కావలసినట్టు లుక్ రెడీ చేసుకుంటున్నాడు. దీంతో ఇటీవల మహేష్ బయట కనిపిస్తే SSMB29 లుక్స్ అంటూ నెట్టింట్లా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని ,త్వరగా ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి అంటూ ఫ్యాన్స్ రోజూ సోషల్ మీడియాలో అడుగుతున్నారు.
తాజాగా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన KL నారాయణ ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి మాట్లాడారు. KL నారాయణ మాట్లాడుతూ.. RRR తర్వాత రాజమౌళికి హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆయన వెళ్ళలేదు. నాకు 15 సంవత్సరాల క్రితం మూవీ తీస్తానని చెప్పారు. మహేష్ బాబుతో చిత్రం అప్పుడే అనుకున్నాం. ఇప్పుడు అయన మాట నిలబెట్టుకుంటూ మూవీ తీస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సినిమాకి సంబంధించిన ఏ విషయమైనా రాజమౌళి నాతో పంచుకుంటారు. మహేష్ సినిమాకు కావాల్సిన లుక్ కోసం రెడీ అవుతున్నాడు. షూటింగ్ ఆగస్టు లేదా సెప్టెంబర్ లో మొదలవుతుందని తెలిపారు.