ప్రజల్లో నమ్మకం కోల్పోయిన కాంగ్రెస్ ఇప్పుడు వారిని ఆకర్షించడానికి కొత్త ఎత్తులు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ జిత్తులు ప్రజలకు తెలుసు. వాళ్లు 5 గ్యారంటీలు తెచ్చినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా ఓటర్ల మనసును మార్చలేరు. నేను వాళ్లలా కాదు. గాలి మాటలు చెప్పను.. చెప్పింది చేసి చూపిస్తా అని తెలిపారు. దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే వరకు విశ్రమించను’ అని ఆయన అన్నారు.
కర్ణాటక, తెలంగాణ.. కాంగ్రెస్కు ఏటీఎంలుగా మారిపోయాయని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్గఢ్లో జరిగిందే ఈ 2 రాష్ట్రాల్లో త్వరలో జరగబోతోందని ఆరోపించారు . ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో అవినీతి రాకెట్ నడుస్తోంది. బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీ ఒకటే. ప్రస్తుతం కమీషన్ లేకుండా ఏ పనీ జరగట్లేదు. లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ పేరుంది. ఇక టెక్నాలజీ హబ్ ఉన్న కర్ణాటక ఇప్పుడు ట్యాంకర్ హబ్ గా మారిపోయింది’ అని అన్నారు.