దేశంలోని రైతుల అభివృద్ధి కోసం పీఎం మోడీ ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారు..ప్రభుత్వం అనేక ప్రయోజనకరమైన పథకాలను అమలు చేస్తోంది. తద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో ఇప్పటివరకు 12 విడతలు రైతుల ఖాతాలకు చేరాయి..ఈ పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం రూ.6000 సహాయం అందజేస్తారు.
ఈ మొత్తం 6000 రూపాయలు మూడు వాయిదాల్లో అందజేస్తోంది కేంద్రం.13వ విడత ఎప్పుడెప్పుడా అని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు దానికి సంబందించిన మరో అప్డేట్ వచ్చింది. 13వ విడత నిధులను ఇవాళ కేంద్రం విడుదల చేయనుంది. కర్ణాటక బెళగావిలో పర్యటించనున్న ప్రధాని మోడీ… ఈ నిధులను విడుదల చేస్తారు. దేశ వ్యాప్తంగా ఈ పథకం కింద అర్హులైన 8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.16800 కోట్లను జమ చేయనున్నారు. కానీ ఈ – కేవైసీ చేయకుంటే ఈ పథకం డబ్బులు అకౌంట్లో జమ కావు.