అదిరే LIC పాలసీ.. ప్రీమియం తక్కువ కవరేజీ ఎక్కువ..!

-

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలని అందిస్తోంది. ఈ పాలసీల వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. మూడు నెలల క్రితం ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ ప్లాన్ ని తీసుకు వచ్చింది. మరి ఆ ప్లాన్ వివరాలని ఇప్పుడు చూద్దాం. దీని ద్వారా తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ పొందవచ్చు.

టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ వివరాలు:

ఎల్ఐసీ అందిస్తున్న ప్రత్యేక టర్మ్ ఇన్స్యూరెన్స్ తో చక్కటి బెనిఫిట్స్ ని పొందొచ్చు.
నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ ఇది. మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు దీనిలో. ఒకవేళ పాలసీహోల్డర్ మరణిస్తే డబ్బులు నామినీకి ఇస్తారు. ఆన్‌లైన్‌లో మాత్రమే ఈ పాలసీ వుంది. ఏజెంట్ల దగ్గర ఈ పాలసీ లేదు.
లెవెల్ సమ్ అష్యూల్డ్ లేదా ఇన్‌క్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అనే రెండు ఆప్షన్స్ వున్నాయి ఎంచుకోవచ్చు.

అర్హత వివరాలు:

కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి.
కనీస సమ్ అష్యూర్డ్ రూ.50 లక్షలు గా వుంది. గరిష్ట పరిమితి లేదు. మెచ్యూరిటీ వయస్సు 80 ఏళ్లు.
పాలసీ టర్మ్ 10 నుంచి 40 ఏళ్లు ఉంటుంది.
ఇందులో కోటి రూపాయల బీమా తీసుకున్నా ప్రీమియం తక్కువగా వుంది.

ఎంత వస్తుంది..?

20 ఏళ్ల వయస్సు వారు ఆప్షన్ 1 ని ఎంచుకుంటే 20 ఏళ్ల పాలసీ టర్మ్‌ తో రూ.1 కోటి పాలసీ తీసుకుంటే…. రెగ్యులర్ ప్రీమియం ఏడాదికి రూ.7,047 + జీఎస్‌టీ చెల్లించాలి. అంటే రోజుకి రూ.20 లోపే.
సింగిల్ ప్రీమియం అయితే రూ.75,603 + జీఎస్‌టీ కట్టాల్సి వుంది. అప్పుడు 20 ఏళ్ల పాటు రూ.1 కోటి కవరేజీ లభిస్తుంది.
ఒకవేళ ఆప్షన్ 2 ని ఎంచుకుంటే సమ్ అష్యూర్డ్ పెరుగుతూ ఉంటుంది.
ఏడాదికి రూ.9,345 + జీఎస్‌టీ ప్రీమియం కట్టాలి.
సింగిల్ ప్రీమియం అయితే రూ.1,02,617 + జీఎస్‌టీ కట్టాల్సి వుంది.
ఈ పాలసీ 5 ఏళ్లు ముగిసిన తర్వాత ఏటా 10 శాతం చొప్పున సమ్ అష్యూర్డ్ పెరుగుతుంది. ఇదిలా ఉంటే 15వ ప్రీమియం టైం కి సమ్ అష్యూర్డ్ డబుల్ అవుతుంది. అంటే రూ.2 కోట్ల కవరేజీ మీకు వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news