ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం ఎలా వచ్చింది..? ప్రాముఖ్యత, చరిత్ర ఇదే..!

-

ప్రతి సంవత్సరం మార్చి 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం ని జరుపుకుంటాము. ప్రాణాలను త్యాగం చేసిన సిబ్బందిని గౌరవించేందుకు ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం ని జరుపుకుంటాము.

ఈ దినోత్సవం యొక్క ఉద్దేశ్యం ఏమిటి..?

పౌర రక్షణ, అత్యవసర నిర్వహణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. అలానే అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదం నుండి బయట పడేందుకు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి… పౌర జనాభాను మెరుగ్గా సిద్ధం చేయడమే ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం యొక్క ఉద్దేశ్యం.

ఎలా పౌర రక్షణ దినోత్సవం మొదలు పెట్టారు..?

అంతర్జాతీయ పౌర రక్షణ సంస్థ 2012లో అధికారికంగా పౌర రక్షణ దినోత్సవం ని మొదలు పెట్టారు.
ఆ రోజు వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకోవడానికి మార్చి 1వ తేదీని ఎంపిక చేసుకుంటారు. అంతర్జాతీయ పౌర రక్షణ సంస్థ (ICDO) 1990లో ప్రపంచ సెలవుదినంగా ప్రకటించింది. ఇది ఒక అంతర్-ప్రభుత్వ సంస్థ. పౌరులు అభివృద్ధి చెందడానికి, సేఫ్ గా ఉండడానికి సహాయపడుతుంది. మౌలిక సదుపాయాలు, పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తుంది.

ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం చరిత్ర:

ఇంటర్నేషనల్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ దీన్ని స్థాపించింది. 1931లో సర్జన్-జనరల్ జార్జ్ సెయింట్-పాల్ దీన్ని మొదలు పెట్టారు. అసోసియేషన్ ఆఫ్ జెనీవా జోన్స్‌ను కూడా ఈయన స్టార్ట్ చేసారు. తరువాత ICDOగా మారింది. పౌరులకు ప్రకృతి వైపరీత్యాల నుండి ఎలా వాళ్ళని రక్షించుకోవాలో నేర్పడం, వాటిని ఎలా నివారించాలి, ఎలా వాళ్ళని సిద్ధం చెయ్యాలి వంటివి నేర్పడం జరుగుతుంది.

ICDO ప్రస్తుత రాజ్యాంగం 1972లో సంస్థ యొక్క సభ్యదేశాలచే ఆమోదించబడింది. అలానే అదే సంవత్సరం మార్చి 1 నుండి అమలు లోకి వచ్చింది. ఇలా అప్పటి నుండి కూడా మార్చి 1 ప్రపంచ రక్షణ దినోత్సవంగా జరుపుకుంటారు.

ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటి..?

ప్రమాదాలు లేదా విపత్తుల సందర్భంలో స్వీయ-రక్షణ కోసం అవగాహనను పెంచడమే దీన్ని ఉద్దేశ్యం.

Read more RELATED
Recommended to you

Latest news