సూపర్ ఫిట్​గా టాలీవుడ్ హీరో వైఫ్.. ఫిదా అవుతున్న నెటిజన్స్

-

టాలీవుడ్ హీరోయిన్.. బిగ్​బాస్ బ్యూటీ.. టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ సతీమణి వితికా షేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సినిమాలతో టాలీవుడ్​లోకి అడుగుపెట్టిన ఈ భామ అంతగా అవకాశాలు రాకపోవడంతో నెమ్మదిగా తెరపై కనుమరుగైపోయింది. ఇక ఆమె పని అయిపోయిందనుకున్న టైంలో బిగ్​బాస్ ఆఫర్​ వచ్చింది.

బిగ్​బాస్ షోలో తన భర్త వరుణ్ సందేశ్​తో వితిక చేసిన సందడి అంతా ఇంతా కాదు. బిగ్​బాస్​లో వచ్చిన ఫేమ్​తో ఈ బ్యూటీ ఆ తర్వాత పలు కార్యక్రమాలకు హోస్టుగా అవకాశాలు అందుకుంది. ఇక యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఈ బ్యూటీ రెండు చేతులా సంపాదిస్తోంది.

సోషల్ మీడియాలో వితికా ఓ సెన్సేషన్. తరచూ తనకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ హల్​చల్ సృష్టిస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ ఫిట్​నెస్ చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్​ యాక్టివ్‌గా ఉంటూ తన క్రేజ్ పెంచుకుంటోంది. వితికా వీడియోస్ అంటే మినిమమ్ గ్యారెంటీ అనే పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

Read more RELATED
Recommended to you

Latest news