Manchu Vishnu : కూతుళ్లు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న మంచు విష్ణు

-

టాలీవుడ్ హీరో మంచు విష్ణు-విరోనికాల 15వ వార్షికోత్సవం నేడు. వెడ్డింగ్ ఆనివర్సరీ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తమ తల్లిదండ్రుల వెడ్డింగ్ ఆనివర్సరీకి ఓ మంచి సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు అరియానా, వివియానా. ఓ బ్యూటిఫుల్ వీడియోతో విష్ణు-విరోనికాలకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ సర్‌ప్రైజ్ చూసి విష్ణు ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ ఆ వీడియో ఏంటో చూశారా..?

మంచు విష్ణు – ఆయన సతీమణి విరానికా బుధవారం రోజున వివాహ 15వ వార్షికోత్సవాన్ని కుటుంబసభ్యులతో సంతోషంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా అరియానా, వివియానా తన తల్లిదండ్రులను సర్‌ప్రైజ్‌ చేస్తూ ఓ వీడియోను బహుమతిగా అందించారు. ఈ వీడియోలో విష్ణు- విరోనికాకు సంబంధించిన మోస్ట్‌ స్పెషల్‌ మూమెంట్స్‌ అన్నింటినీ పొందుపరిచారు.

‘మై ఫాదర్‌ లవ్స్‌ మై మామ్‌’ అంటూ ఓ పాటనూ ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోను విష్ణు ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. ‘‘ఈ సాంగ్‌ పూర్తయ్యే సమయానికి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. థ్యాంక్యూ డార్లింగ్స్‌. మీరిచ్చిన ఈ సర్‌ప్రైజ్‌ను నేను ఎప్పటికీ మర్చిపోను’’ అని రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news