స్మితా సబర్వాల్‌ కు బిగ్ షాక్..13 మందిని బ‌దిలీ చేస్తూ ఉత్త‌ర్వులు!

-

 

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌ కు బిగ్ షాక్..తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా 13 మంది అధికారులను బ‌దిలీ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణ‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు చోటుచేసుకున్నాయి.

13 మందిని బ‌దిలీ చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చిన సీఎస్‌ శాంతికుమారి.. ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చారు.జీ హెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబ‌ర్తికి పూర్తి బాధ్యతలు అప్పగించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. టూరిజం, కల్చరల్ సెక్రటరీగా స్మితా సబర్వాల్‌ కొత్తగా నియామకం అయ్యారు. బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా శ్రీధర్ ను నియామకం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్.

 

మహిళ, శిశు సంక్షేమ సెక్రటరీగా అనిత రామచంద్రన్ ను నియామకం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ట్రాన్స్‌కో సీఎండీగా కృష్ణ భాస్కర్, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా సురేంద్ర మోహన్ నియామకమయ్యారు. ఆరోగ్య శ్రీ సీఈవోగా శివశంకర్, పంచాయతీరాజ్ డైరెక్టర్‌గా శ్రీజన, ఆయుష్ డైరెక్టర్‌గా చిట్టెంలక్ష్మి బదిలీ అయ్యారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేష‌న్‌ డైరెక్టర్‌గా కృష్ణ ఆదిత్య, లేబర్ కమిషనర్‌గా సంజయ్‌కుమార్ ను బదిలీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. జీఏడీ కమిషనర్‌గా గౌరవ్ ఉప్పల్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా హరికిరణ్ నియామకమయ్యారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news