ఢిల్లీలో కేటీఆర్ బిజీ.. కేంద్రమంత్రి కట్టర్ కు ఫిర్యాదు!

-

 

 

ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజీ.. బిజీ గా గడుపుతున్నారు. ఈ తరుణంలోనే కేంద్రమంత్రి కట్టర్ కు ఫిర్యాదు చేసారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ను కలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ఫిర్యాదు చేశారట. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమృత్ స్కిం లో జరిగిన స్కామ్ లపై పిర్యాదు చేసిన కేటీఆర్,ఎంపీ వద్దిరాజు రవిచంద్ర… ఈ మేరకు కేంద్ర మంత్రి తో సమావేశం అయ్యారు.

అమృత్ పథకం టెండర్లలో రేవంత్ తన బావమరది సృజన్‌ రెడ్డికి లాభం చేకూర్చేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు గులాబీ నేతలు. ఇప్పటికే ఈ విషయం లేఖ ద్వారా కేంద్ర మంత్రి మనోహర్ లాల్‌ ఖట్టర్‌ దృష్టికి తీసుకెళ్లిన కేటీఆర్… తాజాగా ఢిల్లీకి వెళ్లి వివరించారు. ఢిల్లీలోని శాస్త్రి భవన్లో కేంద్ర మంత్రిని నేరుగా కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేసిన కేటీఆర్… రేపు హైదరాబాద్ కు రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news