ఏపీ ఉద్యోగుల కీలక నిర్ణయం..ఇకపై 10 నుంచి 5 గంటలు మాత్రం ఉద్యోగం

-

ఏపీ ఉద్యోగుల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి నుంచి ఉద్యోగ సంఘాల ఉద్యమం ప్రారంభం కానుందని తెలిపారు ఏపీ జె.ఏ.సి. అమరావతి చైర్మన్ బొప్పారాజు వేంకటేశ్వర్లు. అలాగే, సంఘాలలో ఐక్యత లేకపోయినా ఉద్యోగులు అంతా సమిష్టిగా పోరాడి హక్కులు సాధించుకోవాలి…దశల వారీగా నిరసనలు,ప్రదర్శనలు చేయాలని కోరారు ఏపీ జె.ఏ.సి. అమరావతి చైర్మన్ బొప్పారాజు వేంకటేశ్వర్లు.

ఇక నుంచి 10 నుంచి ఐదు గంటల వరకు మాత్రమే ఉద్యోగం ఉందని వివరించారు. మా ఉద్యోగ , ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆర్ధిక ఆర్ధికేతర సమస్యలను 4 ఏళ్లుగా ప్రభుత్వం పట్టించుకోలేదని.. మా ఉద్యమానికి ఏపి సిపిఎస్ఏ కూడా మద్దతు ప్రకటించిందని తెలిపారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగ వర్గాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసిందో చెప్పాలని.. హామీ ఇచ్చి మరిచిపోయిన అంశాలను గుర్తుచేయడానికే మా ఉద్యమమని చెప్పారు. డిఏ ఏరియర్స్ లక్షలాది రూపాయల ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు‌‌…మూడు డిఏలు ఇప్పటికీ చెల్లించలేదు….రిటైర్ అయిన వారికి బకాయి చెల్లించలేదు….ఏడాదిగా పోలీస్ లకు సరండర్ లీవులకు చెల్లింపులు ఇవ్వలేదని ఆగ్రహించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news