సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు రెండు అవార్డులు రావడం సంతోషంగా ఉందని…మంత్రి హరీష్ రావు అన్నారు. హరితహారం లో భాగంగా కలెక్టరేట్ ని పచ్చదనంతో నింపేశారు అందుకే ఐఎస్ఓ 1401 , ఐఎస్ఓ 9000 అవార్డులు వచ్చాయి…హరితహారం లో భాగంగా 270 కోట్ల మొక్కలు పెంచే లక్ష్యం నెరవేరుతోందని తెలిపారు. రాష్ట్రంలో 7 శాతం అడవులు పెరిగాయి.. నేడు తెలంగాణ ఏది అమలు చేస్తుందో , రేపు దేశం అనుసరిస్తుందని వివరించారు.
కొందరు ఓట్ల కోసం రాజకీయాలు చేస్తారని.. హరిత హారం భవిష్యత్ తరాల కోసం సిఎం కెసిఆర్ ఆలోచన అని తెలిపారు. 270 కోట్ల మొక్కలు నాటడం హరిత హారం లక్ష్యమని.. తెలంగాణ తప్పా దేశంలో ఎక్కడా ఊరు ఊరికి నర్సరీలు లేవని వెల్లడించారు. పర్యావరణం దెబ్బతిని ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని.. పర్యావరణాన్ని మెరుగుపర్చేందుకు హరితహారం అన్నారు. ఏడు శాతం గ్రీన్ కవర్ పెరిగిందని కేంద్రమే చెప్పిందని.. తెలంగాణా తరహాలో రైతు పథకాలు ప్రారంభించాలని ఇతర రాష్ట్రాల రైతులు కోరుతున్నారని చెప్పారు.