నేను తెలంగాణ బిడ్డనే…వెలివేయకండి – పూనమ్ కౌర్

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అలాగే పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఈమె ఎంత అందంగా ఉంటుందో అంతే కాంట్రవర్సీలలో కూడా తలదూరిస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ను ఎవరైనా ఒక మాట అంటే చాలు తనదైన శైలిలో ట్వీట్ ల వర్షం కురిపిస్తూ ఎదుటివారిని ముప్ప తిప్పలు పెడుతుందని చెప్పవచ్చు.

ఇక గత కొంత కాలం నుంచి వివాహానికి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎందుకు వివాహం చేసుకోలేదు అనే వార్తలు కూడా రకరకాల కోణాలలో వైరల్ అవుతున్నప్పటికీ ఈమె మాత్రం వాటిపై స్పందించడం లేదు. ఇది ఇలా ఉండగా, తాజాగా మహిళ దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొంది పూనమ్‌. ఈ సందర్భంగా వేదిక మీద కంటతడి పెట్టుకుంది సినీ నటి పూనమ్ కౌర్. నేను తెలంగాణ లో పుట్టానని… కానీ నన్ను పంజాబి అమ్మాయి అని వెలి వేస్తున్నారని సీరియస్‌ అయ్యారు పూనమ్ కౌర్. నేను తెలంగాణ బిడ్డను… నన్ను అలా దూరం చేయకండని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news