కేంద్ర ప్రభుత్వ సంస్థలో 583 ఉద్యోగాలు… రాత పరీక్ష కూడా ఉండదు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. న్యూఢిల్లీ లోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్న వాళ్ళు ఈ పోస్టుల కి అప్లై చేసుకో వచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… దీనిలో మొత్తం 583 పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే..

jobs
jobs

మీటర్‌ రీడర్స్‌, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు ఖాళీ వున్నాయి. అర్హత వివరాలని చూస్తే.. మీటర్‌ రీడర్స్‌ పోస్టులకైతే 12వ తరగతి ప్యాస్ అయ్యి ఉండాలి. ఫీల్డ్‌ సూపర్‌వైజర్ పోస్టులకు అయితే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. వయస్సు వివరాలని చూస్తే.. అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్యన ఉండాలి. ఈ పోస్టుల కి షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తూ వుంటారు.

ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాల్సి వుంది. మార్చి 10, 2023వ తేదీలోపు ఈ పోస్టుల కి అప్లై చేసుకోవాల్సి వుంది. అప్లికేషన్‌ ఫీజు విషయానికి వస్తే.. రూ.1000లు ఫీజు పే చెయ్యాల్సి వుంది. ఎంపికైన వారికి నెలకు రూ.20,357ల నుంచి రూ.22,146ల వరకు పే చెల్లిస్తారు. పూర్తి వివరాలని మీరు https://icsil.in/requirement-careers లో చూసి అప్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news