మహిళా దినోత్సవం…ఏపీ స్త్రీలకు మొక్కుబడి రోజు కాదు – విజయసాయి

-

అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఇదివరకు ఏదో మొక్కుబడిగా జరిపే కార్యక్రమం. కాని, ఆంధ్రప్రదేశ్‌ మహిళలకు మాత్రం గత కొన్నేళ్లుగా తాము సాధించిన ప్రగతిని గుర్తుచేసుకునే గొప్ప సందర్భం మార్చి 8వ తేదీ. తెలుగు మహిళలు ప్రపంచ స్త్రీలు, భారత సోదరీమణులతో పాటు వేగంగా ప్రగతిపథంలో ముందుకు పరిగెడుతున్నారని  తెలిపారు విజయసాయి రెడ్డి. ఐక్యరాజ్యసమితి నిర్ణయంతో 1977 నుంచీ ప్రపంచ మహిళాలోకం, వారికి తోడుగా నిలిచే పురుషులు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆనందోత్సాహాలతో జరుపుకోవడం మొదలైందని చెప్పారు.

 

 

వేలాది ఏళ్ల నుంచీ స్త్రీలకు సమాన గౌరవం ఇవ్వాలనే భావనలు ఉన్న భారతదేశంలో కూడా ఆడబడుచుల అభివృద్ధికి, సాధికారతకు ఉన్న ప్రాధాన్యం గురించి గుర్తుచేసుకోవడం ఈ రోజు నుంచి ఆరంభమైంది. 2019 మే 30న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఏపీలో మహిళల అక్షరాస్యత జాతీయ సగటు అక్షరాస్యతతో పోల్చితే తక్కువ. 2017–18లో జాతీయ సగటు 70.3% ఉండగా ఏపీలో ఇది అప్పుడు 59.9 శాతం ఉంది. వైఎస్సార్సీపీ సర్కారు మొదటి నుంచీ మహిళా సంక్షేమానికి తీసుకున్న అనేక చర్యలు, అమలు చేస్తున్న కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో స్త్రీల అక్షరాస్యత 2021–22 నాటికి అనూహ్యరీతిలో 67.35 శాతానికి పెరిగింది. ఇంతటి మహిళా ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అనేకం దోహదం చేశాయన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news