అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

-

రాష్ట్రంలో మూడు కట్టడాల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఏప్రిల్ 14న అంబేడ్కర్ విగ్రహం, 30న కొత్త సచివాలయం, జూన్ 2న తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన నూతన సచివాలయం, అమరవీరుల స్మృతి చిహ్నం పనుల పురోగతిని పరిశీలించారు. మరోవైపు అంబేడ్కర్ విగ్రహం నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు.

హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్ తీరాన నిర్మిస్తున్న 125అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవ తేదీని కూడా నిర్ణయించిన విషయం తెలిసిందే. గురువారం రోజున జరిగిన మంత్రి వర్గ సమావేశంలో అంబేడ్కర్‌ జయంతి అయిన ఏప్రిల్ 14న ఆవిష్కరించటంతోపాటు బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆలోగా పనులను పూర్తిచేసేలా అధికారులు నిమగ్నమయ్యారు.

ఈ మేరకు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి….. సకాలంలో పూర్తిచేయ్యేలా చూడాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాత జయంతి రోజున ఈ అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించటంతోపాటు భారీబహిరంగసభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news