కరీంనగర్ లో విజయవంతంగా దాస్ క దమ్కీ – ట్రైలర్ లాంచ్ జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ చేశారు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. అనంతరం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, విశ్వక్సేన్ అంటే దేవుళ్ళకి అధిపతి అని.. సెంటిమెంట్ కు మారుపేరు కరీంనగర్ గడ్డ.. ఇక్కడ సక్సెస్ తప్ప ఫేయిల్యూర్ ఉండదని వెల్లడించారు.
తెలంగాణ వస్తే ఏం వస్తుంది అనే వారికి ఇలాంటి ఈవెంట్స్ లే నిదర్శనమని.. గతంలో కరీంనగర్ రావాలంటే భయం ఉండేది. కానీ ఇప్పుడు చాలా ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్ ను కూడా కరీంనగర్ లో ఏర్పాటు చేయాలని.. రానున్న రోజుల్లో హైదరాబాద్ తర్వాత కరీంనగర్ లో సినిమా షూటింగ్ లు జరిగేలా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలోనే కరీంనగర్ లో ఫిలిం హాబ్ గా మారుస్తామని ప్రకటించారు. అందమైన లోకేషన్స్ కరీంనగర్ లో వున్నాయ్.. మరిన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.