ఆస్కార్ వేదికపై తెలుగు పాట సంచలనం.. నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం

-

వచ్చింది.. ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ప్రపంచ సినిమా తెర పై ఇప్పటికే తన సత్తా చాటిన RRR సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ఆస్కార్ వేడుకల్లో వేస్ట్ ఒరిజినల్ సాంగ్ గ RRR సినిమా లోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. తెలుగు సినీ చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఈ ఘనత సాధించిన మొదటి సినిమాగా RRR చిత్రం నిలిచిపోయింది.

నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కింది. ఎంతో ఉత్కంఠగా వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకుల చిరకాల కల నెరవేరింది. తెలుగు సినిమా ఆస్కార్​ను ముద్దాడింది బాలీవుడ్ గడ్డపై తెలుగు సినిమా తన సత్తా చాటింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ దక్కించుకుంది. ఆస్కార్‌ను దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా నాటునాటు రికార్డులకు ఎక్కింది. హాలీవుడ్‌ పాటలను తలదన్నుకుంటూ చివరకు వరకు చేరిన నాటునాటు విజయకేతనం ఎగరవేసింది. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి కుమారుడు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్​ పాడారు. ఈ పాటను చంద్రబోస్​ రచించగా.. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. నాటునాటు పాటకు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీనికి ప్రేమ్‌రక్షిత్‌ కొరియోగ్రాఫర్​గా వ్యవహరించారు. ప్రముఖ దర్శకుడు ఎస్​.ఎస్​ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్​, క్రిటిక్స్ ఛాయిస్​ ఆవార్డులు సాధించింది..

మెగాపవర్​ స్టార్​ రామ్‌చరణ్‌, జూనియర్​ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్​ఆర్​ఆర్​’. దీనికి టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్​ఎస్​ రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా గతేడాది మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇండియన్ సినిమా చరిత్రలోనే కాకుండా.. గ్లోబల్​ బాక్సాఫీస్​ వద్ద బ్లాక్​బస్టర్​గా నిలిచి కలెక్షన్ల సునామీ సృష్టించింది.

“పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు… పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు… కిర్రు సెప్పులేసుకూని కర్రసాము సేసినట్టు… మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు… ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు… నా పాట సూడూ.. నా పాట సూడూ” అంటూ ఈ సాంగ్​తో వీర నాటు, ఊర నాటు స్టెప్పు లేస్తూ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియుల్ని తెగ ఊర్రూతలూగించారు యంగ్ టైగర్​ ఎన్టీఆర్​, మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​. విదేశీయలు చేత కూడా ఈ పాటకు స్టెప్పులేయించేలా చేశారు.

ఇక ఈ పాట కోసం రాజమౌళి.. ఎన్టీఆర్, చరణ్​లతో 100 సిగ్నేచర్ స్టెప్పులు వేయించారు. 18 సార్లు రీటేక్ చేయించారు. చివరకు రెండో దానికే ఓకే చెప్పారు. గతంలో ఓ కార్యక్రమం కోసం రాజమౌళి అమెరికాకి వెళ్లినప్పుడు నాటు నాటు గురించి ప్రస్తావిస్తూ.. “నా స్నేహితులు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు ఇద్దరూ అద్భుతమైన డ్యాన్సర్లు. ఇక వాళ్లిద్దరూ కలిసి ఒకే పాటకు డ్యాన్స్ చేస్తున్నారంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఆ పాట కోసం నేను ఒక సీన్‌ను క్రియేట్‌ చేసి స్టోరీలో భాగంగా ఆ పాట వచ్చేలా చూశా. ఇక ‘నాటు నాటు’ సాంగ్‌కు కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌. అతనికి డ్యాన్స్ అంటే ప్రాణం. 3 నిమిషాలకు పైన ఉన్న ‘నాటు నాటు’ సాంగ్‌ కోసం అతడు 100 సిగ్నేచర్‌ స్టెపులు వేయించారు. ఆ పాటకు డ్యాన్స్‌ వేసేటప్పటికి డ్యాన్సర్స్‌ అందరికీ కాళ్ల నొప్పులు వచ్చాయి” అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news