Das Ka Dhamki Trailer : దాస్ కా ధమ్కీ మరో ట్రైలర్ వచ్చేసింది

-

యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ‘దాస్ కా దమ్కీ’ మూవీ చేస్తున్నాడు. కామెడీ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్నకుమార్ కథని సమకూరుస్తున్నాడు.

నివేదా పేతురాజు మరోసారి విశ్వక్ తో కలిసి నటించబోతుంది. అయితే, ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా లాంచ్ చేశారు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. నిన్న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కరీంనగర్‌ లో జరుగగా.. ఈ సందర్భంగా ట్రైలర్‌ లాంచ్‌ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ ను అనౌన్స్‌ చేశారు. ఈ నెల 22న ఈ సినిమా ను రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news