మాంసాహారుల‌కు బ్రెయిన్‌స్ట్రోక్స్‌కు లింక్ ఏంటో తెలుసా..

-

సాధార‌ణంగా మెదడులో రక్తనాళాలు చిట్లి చనిపోవడం (బ్రెయిన్‌ స్ట్రోక్‌) మాంసాహారుల్లో ఎక్కువగా జరుగుతుందని, శాకాహారుల్లో తక్కువగా ఉంటుందని ప్రజలు న‌మ్ముతున్నారు. పర్యవసానంగా బ్రిటన్‌లో శాకాహారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం వారి సంఖ్య 17 లక్షలకు చేరుకుంది. వాస్తవానికి మాంసాహారుల కన్నా శాకాహారుల్లోనే ఈ స్ట్రోక్స్‌ ఎక్కువగా వస్తాయని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన ఓ సుదీర్ఘ అధ్యయనంలో తేలింది.

వారు 50 వేల మందిపై 18 ఏళ్ల పాటు అధ్యయనం జరిపి, ఈ విషయాన్ని తేల్చారు. మాంసాహారుల కన్నా శాకాహారుల్లో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం 20 శాతం అధికమని పరిశోధకులు తెలిపారు. శాకాహారుల్లో మెదడు రక్తనాళాల గుండా తక్కువ కొలెస్ట్రాల్‌, బీ12 లాంటి విటమిన్లు తక్కువగా ప్రవహించడం వల్ల రక్తనాళాలు చీలిపోయే అవకాశం ఎక్కువగా ఉందని వారు చెప్పారు. అయితే మాంసాహారుల్లో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు చెప్పారు.

మాంసహారులతో పోలిస్తే శాకాహారుల్లో గుండెపోటు వచ్చే అవకాశం 22 శాతం తక్కువని చెప్పారు. అలాగే సగటున 45 ఏళ్ల ప్రాయం గల 50 వేల మందిని ఎంపిక చేసుకొని, వారిపై పరిశోధకులు పరిశోధనలు చేశారు. వారిలో సగం మంది మాంసాహారులుకాగా, మూడో వంతు మంది శాకాహారులు కాగా, ఐదో వంతు మంది చేపలు తినేవారు. వారిపై 18 ఏళ్ల పాటు అధ్యయనం కొనసాగించగా వారిలో 2,820 మంది గుండె జబ్బులకు గురి కాగా, 1,072 మంది బ్రెయిన్‌ స్ట్రోక్స్‌కు గురయ్యారు.

మాంసాహారులపైన అధ్యయనం జరపడం చాలా సులువుగానీ శాకాహారులపై అధ్యయనం జరపడం కష్టమనీ వివిధ యూనివర్శిటీలకు చెందిన ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. నేటి పరిస్థితుల్లో గుండెపోటు కన్నా బ్రెయిన్‌ స్ట్రోక్స్‌ పెరగడం వల్లనే ఎక్కువమంది మరణిస్తు న్నారు. అందుకనే మాంసాహారమే ఒకవిధంగా మేలనీ, ఆయన పేర్కొన్నారు. అయితే సమతులాహారం అన్నిరకాలుగా మేలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news