నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ స్కీమ్‌తో… ఎన్నో లాభాలు..!

-

నేషనల్ పెన్షన్ సిస్టమ్ కాంట్రిబ్యూషన్‌ రిటైర్‌మెంట్‌ సేవింగ్స్‌ స్కీమ్‌. ఈ స్కీమ్ తో భవిష్యత్తులో వచ్చే అవసరాలని తీర్చుకునేందుకు అవుతుంది. ఈ స్కీమ్ ఆర్థిక భరోసా ఇస్తుంది. రిటైర్‌మెంట్‌ కోసం పొదుపు చెయ్యచ్చు. 2004లో పెన్షన్ రంగ సంస్కరణల్లో భాగంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ని ప్రవేశపెట్టింది ఇండియన్ గవర్నమెంట్. చాలా రకాల లాభాలను మనం ఈ స్కీమ్ తో పొందొచ్చు.

ఎన్‌పీఎస్ స్కీమ్‌లో ఇండివిడ్యువల్‌ నుంచి ఫండ్స్‌ను సేకరించి క్రియేట్ చేస్తారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ కింద ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లు ప్రభుత్వ బాండ్‌లు, కార్పొరేట్ డిబెంచర్లు ఇలా పెట్టుబడి ని పెడతారు. 18-70 ఏళ్ల మధ్య వాళ్ళు ఈ అకౌంట్ ని ఓపెన్ చెయ్యచ్చు. ఎన్‌పీఎస్‌ని అన్‌బండిల్ ఆర్కిటెక్చర్ ద్వారా దీన్ని నిర్వహిస్తారు.

మినిమం ఫండ్ మేనేజ్‌మెంట్ ఛార్జ్ 0.03- 0.09 శాతం. సబ్‌స్క్రైబర్‌లు సరిపోయే అనేక పెన్షన్ ఫండ్ మేనేజర్‌లలో ఎంపిక చెయ్యచ్చు. ఈ అకౌంట్ ని ఓపెన్ చేసాక వ్యక్తికి ప్రత్యేకమైన పర్మినెంట్‌ రిటైర్‌మెంట్‌ అకౌంట్‌ నంబర్‌ ఇస్తారు. నంబర్‌ను ఉద్యోగాలు మారినప్పుడు పోర్ట్‌ చేసుకోవచ్చు. జీవితకాలం మొత్తం ఈ నంబర్‌ ఉంటుంది. ఒక లెవల్‌ అప్‌గ్రేడ్ చేయవచ్చు. టైర్-I అకౌంట్‌ నాన్‌ విత్‌డ్రా పర్మినెంట్‌ రిటైర్‌మెంట్‌ ఖాతా. యాక్టివ్ టైర్-I అకౌంట్‌ ఉన్న సబ్‌స్క్రైబర్ మాత్రమే టైర్-II అకౌంట్‌ ని ఓపెన్ చెయ్యచ్చు. టైర్-I అకౌంట్ హోల్డర్స్‌ కి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news