ఉక్రెయిన్‌-రష్యా పోరులో యుద్ధ ఖైదీలకు నరకం.. తీవ్ర ఆందోళనలో ఐరాస

-

ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఏడాదికిపైగా భీకర యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ యుద్ధంలో లక్షల మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేల మంది సైన్యం మట్టిలో కలిసిపోయారు. లక్షల భవనాలు.. పట్టణాలు నేలమట్టమయ్యాయి. చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులకు దూరమయ్యారు. కుటుంబ పెద్దను కోల్పోయి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

మరోవైపు ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న పోరులో యుద్ధఖైదీలు దారుణమైన వేధింపులకు గురవుతున్నారు. వారిని క్రూరంగా హింసించడంతో పాటు, పోరులో రక్షణ కవచాలుగా వాడుకోవడానికి సైతం ఇరు దేశాలు వెనుకాడటం లేదని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఈ మేరకు కీవ్‌లోని ఐరాస మానవహక్కుల మిషన్‌ జనవరి నుంచి ఆరు నెలల కాలానికి తయారు చేసిన నివేదికను విడుదల చేసింది.

400 యుద్ధఖైదీలతో తాము మాట్లాడామని, ఇందులో రష్యా విడిచిపెట్టిన ఉక్రెనియన్లు సగం మంది, ఉక్రెయిన్‌లో ఖైదీలుగా ఉన్న రష్యన్లు సగం మంది ఉన్నారని తెలిపింది. మాస్కో అధీనంలోని జైళ్లలో మగ్గుతున్న యుద్ధఖైదీలతో మాట్లాడేందుకు అనుమతి లభించలేదని పేర్కొంది. ‘‘25 మంది రష్యా ఖైదీలకు ఉక్రెయిన్‌ సాయుధ దళాలు మరణశిక్ష విధించాయి. ఇది మాకు ఆందోళన కలిగించింది’’ అని ఐరాస పర్యవేక్షణ మిషన్‌ అధిపతి మటిల్డా బాగ్నర్‌ తెలిపారు. అయితే ఈ దారుణానికి మూలకారణం మాత్రం ఉక్రెయిన్‌పై ఆక్రమణేనని బాగ్నర్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news